రాజాము మండల కేంద్రం రాజాం టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణరావు అనారోగ్యంతో ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న రాజాము నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తో కలిసి లక్ష్మణ్ రావును గురువారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైయస్సార్ సిపి పార్టీకి మీ సేవలు చాలా అవసరమని పూర్తిస్థాయిలో త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మీ కుటుంబానికి వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వీరితో పాటు రేగిడి మండలం వైస్ ఎంపీపీలు టంకాల అచ్చం నాయుడు, వావిలపల్లి జగన్మోహన్రావు, ధవలేశ్వరం ఉన్నారు.