బిఎస్సి పారా మెడికల్ ఫలితాలలో బొల్లినేని మెడ్ స్కిల్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి హెచ్ నాగేశ్వరారావు ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఈ ఫలితాలలో తమ విద్యార్థులు షహీనా బేగం, షైలాష్ లిడియా అనాస్టిసియా విభాగంలో యూనివర్సిటీ టాపర్స్ గా నిలవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 5గురు డిస్టింక్షన్, 40మంది ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. తృతీయ సంవత్సరం లో ముగ్గురు డిస్టింక్షన్,17మంది ప్రధమ శ్రేణి లో ఉత్తిర్నాలయ్యారని ఈ సందర్బంగా అయన తెలియచేసారు. విద్యార్థుల ఫలితాలకు కృషి చేసిన అధ్యాపకులకి అధ్యాపేకతరా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి పద్మజ, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.