శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని రైల్వేస్టేషన్లో శుక్రవారం రైల్వే పోలీసులు మాదకద్రవ్యాల కోసం ప్రత్యేక తనిఖీ చేపట్టారు. గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ షేక్ షరీఫ్ తెలిపారు. అనంతమైన మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో పాటు మానవ అక్రమ రవాణా నివారణ పై చర్యలు తీసుకుంటామన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియని వారు ఇచ్చిన తినుబండారాలు తీసుకోవద్దని హెచ్చరించారు. రైలు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులున్నా తమకు వెంటనే ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రయా ణికు లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీ కోదండ రావు, సిబ్బంది భాస్కరరావు, శ్రీనివాస్, గిరి తదితరులు పాల్గొన్నారు.