తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన రాజాం పోలీసులు రెగిడి మండలం పెద్ద కొడిస గ్రామానికి చెందిన కొండేటి శంకరరావు ఆదిలక్ష్మి దంపతులు స్థానిక రాజం నవదుర్గ టెంపుల్ లో అక్షరాభ్యాసం కోసం కుమారుడితో వచ్చారు. అక్షరాభ్యాసం చేసే పనిలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉన్న సమయములో బాలుడు గుడి లోపల నుంచి బయటికి వచ్చేసాడు. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఏడ్చుకుంటూ వెళ్తుండగా కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడిని చేరదీశారు. ఇంతలో తమ కుమారుడు జీవన్ కుమార్ కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు వెతుక్కుంటూ అంబేద్కర్ జంక్షన్ దగ్గరకు చేరుకున్నారు అప్పటికే పోలీసులు బాలుడు తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు కనిపించడంతో వివరాలు అడిగి బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.