గడప గడపలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు. రణస్థలం మండలం సంచాం గ్రామ సచివాలయం పరిధిలోని పున్నానపాలెం, పెసరపాలెం గ్రామాల్లో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని, మూడేళ్లలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఆయా పథకాలతో మూడేళ్లుగా కలిగిన లబ్ధిని ప్రజలకు తెలియజేశారు. స్థానికంగా సమస్యలను ప్రజలతోనే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ గడపకు వెళ్లినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా అనంత తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఉన్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్క అర్హుడికి పథకాలు రాకుండా ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు.