అదానీ ఆస్తులను జప్తు చేయాలని కృష్ణా జిల్లా సీపీఐ ఇన్‌చార్జి కార్యదర్శి టి. తాతయ్య అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆర్‌ఐను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా, చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని, విశాఖ ఉక్కు వంటి అనేక అంశాలను పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయక కార్యదర్శి మున్నంగి నరసింహారావు, కమిటి సభ్యులు మేరుగు విజయ్ కుమార్, మోతుకూరి అరుణ కుమార్, బండి వెంకటరత్నం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.