పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ప్రశాంతి గ్రామములో వ్యభిచారగృహంపై స్థానిక పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు నిర్వాహకులు, కర్ణాటకకు చెందిన ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో ప్రశాంతి గ్రామంలోని ఒక లాడ్జిలోని గదులను తనిఖీ చేశారు. తనిఖీల్లో నిర్వాహకులు నాగరాజు, యుగేశ్వర్తో పాటు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు చెందిన ఇద్దరు యువతులను అరెస్టు చేరారు. అనంతరం డిఎస్పి పుట్టపర్తి, ప్రశాంతి గ్రామంలోని అపార్ట్మెంట్లు, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శ్రీసత్య సాయి జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.