మడకశిర మండలంలోని మణూరు గ్రామానికి చెందిన శ్వేత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. మణూరు గ్రామానికి చెందిన శ్వేతను ఓ యువకుడు ప్రేమించమని వేధిస్తుండేవాడని, వేధింపులు భరించలేక ఈ నెల 5న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.