మడకశిర మండలంలోని చందకచర్ల గ్రామానికి చెందిన ముత్యాలక్క (68) మనస్తాపం చెంది శుక్రవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నాగేంద్ర తెలిపారు. ఎస్ఐ అందించిన వివరాల మేరకు. కంబదూరు మండలం కూరాకులపల్లిలో ముత్యాలక్క సొంత చెల్లెలు సాకమ్మ 15 రోజుల క్రితం మృతి చెందింది. రెండో కుమార్తె భర్త మద్దిలేటి అక్కడికి వెళ్లేందుకు వీల్లేదని వృద్ధురాలికి చెప్పడంతో మనస్తాపంచెంది పొలంలో చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.