వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం తద్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం పెండ్లిమర్రి మండల పరిధిలోని మాచునూరు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ రెడ్డికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం నరసింహారెడ్డి ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరల చంద్రబాబు నాయుడు అధికారం చేపడితేనే జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడుని మరల సీఎం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.