గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి దేవస్థానాన్ని ఉపాద్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ శుక్రవారం సందర్శించారు. దేవతామూర్తులను దర్శించుకొని తీర్ధప్రసాదాలు అందుకున్నారు. శ్రీవెంకటేశ్వర, కోదండ రామాలయం అభివృద్ధికి కృషిచేస్తున్న సంస్థ సభ్యులను కొనియాడారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాలకృష్ణారావు, ఎం. మహేశ్, జట్టు సంస్థ వ్యవస్థాపకుడు పారినాయుడు ఉన్నారు.