ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. శనివారం రాయచోటి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజంపేట రీజనల్ మేనేజర్ ఆర్ రామకృష్ణ, సేల్స్ చీప్ మేనేజర్ సురేష్ బాబు, రాయచోటి శాఖ చీప్ మేనేజర్ జగదీష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి బ్యాక్ అధికారులుతో మాట్లాడుతూ నియోజక వర్గ పరిధిలోని అర్హులైన రైతులకు, నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వాలని కోరారు. గాలివీడు మండలంలోని నూలివీడు, సంబేపల్లె మండలంలోని శెట్టిపల్లె, రాయచోటి రూరల్ మండలంలోని మాధవరం, రామాపురం మండలంలో గువ్వల చెరువు , నీలకంఠరావుపేట, లక్కిరెడ్డిపల్లె మండలంలో ఏ టి ఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఖాతాదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని ఆయన సూచించారు.