ఫిబ్రవరి నెలలో జీడిపూత రావలసినప్పటికీ ఆశాజనకంగా లేదని, వచ్చిన పువ్వు కూడా కాండంలో నలుపు రంగు వచ్చి పువ్వు రాలిపోయి తీవ్రంగా రైతులు నష్టాలు గురవుతున్నారని కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు బమ్మిడి ఆనందరావు, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు బొడ్డు వాసుదేవరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారము పల్లి సారథి గ్రామంలో రైతాంగముతో కలిసి తోటలను పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది బూజు తెగులు వచ్చి రైతుల తీవ్రంగా నష్టపోయారని , నేడు కూడా అలాంటి పరిస్థితి దాపురించిందని అన్నారు. ఈ తెగుళ్లు పై వారియర్ అనే ముందును పిచికారి చేస్తున్నప్పటికీ నివారణ కావట్లేదని రైతులు తమ గోడును తమ వద్ద వెలిబుచ్చారని అన్నారు. దీనిపై హార్టికల్చర్, అలాగే శాస్త్రవేత్తలు పరిశీలన జరిపి సరైన సంరక్షణ మార్గాలు సూచించకపోతే రైతంగానికి తీవ్ర నష్టాలోకి నెట్టేవరవుతరని ఆన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీడి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పురుగుమందులు రైతంగానికి ఉచితంగా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీడి రైతుల నాయకులు చెల్లూరి కుమారస్వామి, బత్తిని ఓంకార్ లతో పాటు రైతులుపోతనపల్లి గుణవతి, బి. నీలమ్మలు పాల్గొన్నారు.