భీమవరం లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆర్కేఆర్ కాలేజీ విద్యార్థిని రాజధానిపై వెంకయ్యను ప్రశ్నించింది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతి పై తన అభిప్రాయం ముందే చెప్పానని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానని తెలిపారు. అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని గుర్తుచేశారు. విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా.. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.