టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ‘మా దరిద్రం నువ్వే జగన్’ అంటున్నారని, అమరావతి నిర్మాణం ఆపేసిన జగన్ రెడ్డి, రాజధాని నిర్మిస్తున్నాని చెప్పి బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకున్నారని అన్నారు. నిన్న అప్పుకట్టాలంటూ సీఆర్డీఏ అధికారుల్ని బ్యాంకర్లు నిలదీశారన్నారు. 2019 డిసెంబర్లో రాష్ట్రానికి ఇకపై మూడు రాజధానులు ఉంటాయని, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్న ముఖ్యమంత్రి.. సీఆర్డీఏ సంస్థ ద్వారా అమరావతి ముసుగులో ఏ ముఖం పెట్టుకొని రూ.3,013 కోట్ల అప్పుచేశారని ప్రశ్నించారు.