టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ను పోలీసులు పదే పదే అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శనివారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు కలిశారు. లోకేష్ పాదయాత్ర కు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. లోకేష్ కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతోందని ఫిర్యాదులో తెలిపారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పటి వరకు డీజీపీని కలిసే అవకాశం రానందున ఆయన్ని కలిసే అవకాశం కల్పించమని గవర్నర్‌ను తెలుగు దేశం నేతలు కోరారు.