ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరాల సామాజికవర్గం ని పట్టించుకోండి అంటూ సీఎం జగన్ కు లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 12, 2023, 12:04 PM

విజయవాడ దుర్గగుడి నూతన పాలకమండలిలో పశ్చిమ నియోజకవర్గంలో బలమైన నగరాల సామాజికవర్గానికి చోటు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని లేఖ ద్వారా కోరామని ఆంధ్రప్రదేశ్‌ నగరాల యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బంక సురేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలక మండలిలో నగరాలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడంపై ప్రభుత్వంపై సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. నగరాల సామాజిక వర్గానికి మేయర్‌ పదవి ఇచ్చారని, ఇతర ఏ పదవులు దక్కకుండా కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి కుట్రను సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇలాంటి చర్యల వల్ల నగరాల సామాజికవర్గం నష్టపోవడమే కాకుండా సామాజికవర్గ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com