యువగళం పాదయాత్ర 16వ రోజైన శనివారం సాయంత్రం కార్వేటినగరం మండలం కత్తెరపల్లె జంక్షన్ వద్దకు చేరగా.. 200 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ కార్యకర్తలు లోకేశ్‌పై పూలవర్షం కురిపించారు. పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ జయహో లోకేశ్, జయహో తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. శనివారం ఉదయం శ్రీరంగరాజపురం మండలంలోని హనుమాన్ టెంపుల్ శిబిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర 17.5 కిలోమీటర్లు సాగి కార్వేటినగరం మండలం కొత్తూరు వద్ద బసకు చేరింది.