విశాఖపట్నం నగరంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, ఇతర నాయకులు సుమారు మూడు వేల మంది ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ సదస్సుకు వేదికను ఖరారు చేయాల్సి వుందని పార్టీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.