ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై బురద జల్లెందుకే విషపు రాతలతో టీడీపీ పుస్తకం రిలీజ్ చేసిందని మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకంలో ఉన్నవన్నీ తప్పుడు రాతలే,.. కనీసం పేరు వేసుకోలేదని మండిపడ్డారు. వివేకా హత్య జగన్ చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం మీదేగా ఏమీ చేశారు?, అప్పుడు ఎఫ్ఐఆర్ లో ఎందుకు జగన్, అవినాష్ పేర్లు చేర్చలేదు? అని పేర్నినాని ప్రశ్నించారు. శవ పంచనామాలో కూతురు అల్లుడు సంతకాలు ఎందుకు తీసుకోలేదు..? ఇప్పుడు పుస్తకంలో రాసిన రాతలు అప్పుడు చార్జిషీట్లో ఎందుకు రాయలేదు? అని ప్రశ్నించారు. సీబీఐ కి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ పుస్తకంలో ఎలా వచ్చిందని, సీబీఐలో ఎవరినైనా మీరు లొంగ దీసుకున్నరా..?, తప్పుడు రాతలు కాకపోతే సీబీఐకి చెప్పింది మీకెలా తెలుసు అని పేర్నినాని అన్నారు.