ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని, లిక్కర్, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి దేవ్ సింహ్ చౌహాన్ అన్నారు.
కేంద్రమంత్రి దేవ్ సింహ్ చౌహాన్ నేడు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడ్డారని, వారి హక్కులను హరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. వలంటీర్లతో విపక్ష నేతలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.