బడుగు, బలహీనవర్గాల ప్రజలకు జనసేనతోనే మేలు జరుగుతుందని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ అన్నారు. తాళ్లరేవు మండల ఉప్పంగలలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మడికి అమీర్ కుమార్ కు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పార్టీలో చేరారు. మహిళా కన్వీనర్లు కడలి ఈశ్వరమ్మ, ముత్యాల జయలక్ష్మి, మండల అధ్యక్షుడు అత్తిలి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa