ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి దశల వారీగా పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష జరగనుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష పాస్ కావాలి. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. మరోవైపు ఈ నెల 20 నుంచి ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జనరల్ విద్యార్థులకు ఈనెల 26న ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి జరగనున్నాయి.