గతంలో విదేశాలకే పరిమితమైన స్ట్రాబెర్రీ.. ఇప్పుడు మన దేశంలోనూ సాగు చేస్తున్నారు. ఒడిశా కోరాపుట్ జిల్లాలో రైతులు ఈ పంటను అధికంగా సాగు చేస్తూ..లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండే స్ట్రాబెర్రీ..లాభసాటిగా ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక స్ట్రాబెర్రీ ప్యాకెట్ అమ్మితే రూ.100 వరకు లాభం వస్తుందని రైతులు చెబుతున్నారు. మొదటి ఏడాదిలోనే రూ.4.60 లక్షలు టర్నోవర్ చేసినట్లు ఓ రైతు తెలిపాడు.