పెడన నియోజకవర్గం గూడూరు మండలం, ముక్కోల్లు గ్రామంలో సోమవారం ఇదేం-ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెడన నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తున్న ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం ప్రభుత్వా ఏర్పాటుకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ అబ్సర్వ్ సాదర బోయిన ఏ డు కొండలు, గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి, గోపి, నాగబాబు, ఎన్ ఏ బేగ్, సమీట ఈశ్వరరావు, కాసగాని శ్రీనివాస్, కాట్రేడ్డి నాగమురళి, సమిట శేఖర్, కాట్రగడ్డ కృష్ణ, సాయన సోమయ్య, కాట్రగడ్డ సత్య నారాయణ, రత్నబాబు, అంబటి అయ్యప్ప, ఉడుముల నరేష్, గంజాల కృష్ణ మోహన్, సమిట నాని, కొనకళ్ళ మహంకాళి రావు, గొరి పర్తి చంద్రశేఖర్, జెన్యావుల శివరావు, వాకా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.