ఏపీ కొత్త గవర్నర్ నియామకం వివాదానికి తెరతీసింది. దేశవ్యాప్తంగా 12 మంది గవర్నర్ల బదిలీలు, మార్పులు జరిగినా.. సుప్రీంకోర్టు మాజీ జడ్జీ అబ్దుల్ నజీర్ నియామకం మాత్రమే హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తిని గవర్నర్ గా నియమించడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. పలు కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే అబ్దుల్ నజీర్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.