మరికొన్ని రోజుల్లో సమ్మర్ రాబోతోంది. ఈ సీజన్ లో లభించే పుచ్చకాయల్లో 92శాతం నీరు ఉంటుంది. సమ్మర్ లో పుచ్చకాయలను తింటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. పుచ్చకాయలో పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్లు బి 1, బి 6, సి, డి, లైకోపీన్ వంటి పోషకాలుంటాయి. పుచ్చకాయ తింటే కడుపు శుభ్రంగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి వేయదు. శరీరాన్ని పుచ్చకాయ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. వ్యాయామం తర్వాత దీనిని తింటే శరీరంలో వాపు తగ్గుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.