కెప్టెన్ గా రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలోనూ విజయవంతమవుతున్నాడు. తాజాగా రోహిత్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు తాను ఆటగాడిగా ఉన్నానని, విరాట్ నుండి కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నానని అన్నాడు. 'మనకు వికెట్ రాకపోయినా పర్వాలేదు కానీ, ప్రత్యర్థి తప్పు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. ఈ విషయాన్ని విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు నేర్చుకున్నా.అదే నేనెప్పుడు అమలు చేస్తున్నా' అని తెలిపాడు.