విజయవాడ నగరంలోని సీపీఎం పార్టీ సొంత కార్యాలయాన్ని నిర్మించుకుంది. సోమవారం ఉదయం సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబి, బి.వి.రాఘవులు పార్టీ రాష్ట్ర సొంత కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ... ఏపీ చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు. ఇక్కడ బీజేపీకి బలం లేకపోయినా ప్రధాన పార్టీలను వారు శాసిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు చేపడతామని తెలిపారు. మార్చిలో దేశ వ్యాప్తంగా లౌకికవాదం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా తాము పని చేస్తామన్నారు. భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేకశక్తులను కలుపుకుని ముందుకు వెళతామని తెలిపారు. ఈ పార్టీ కార్యాలయం ద్వారా ఏపీలో సీపీఎం పోరుబాట ఖరారు అవుతుందని పేర్కొన్నారు.