చిత్తూరు జిల్లా, కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అంతా హుషారుగా కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కొంత దూరం నడిచిన మీదట సడెన్‌గా అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అయితే తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటీవల తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్తారనే వార్తలు వచ్చాయి. అయితే విదేశీ వైద్యులే ఇక్కడికి వచ్చి తారకరత్నకు చికిత్సను అందిస్తున్నారని రామకృష్ణ వెల్లడించారు. అయితే తారకరత్న ఇంకా కోమాలోనే ఉన్నారు. త్వరలోనే ఆరోగ్యం మెరుగుపడి కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.