మందస వాసు దేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నా యి. మూడోరోజు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వాసు దేవునికి హనుమద్వాహన సేవ నిర్వహించారు. అంతకు ముం దు అర్చకులు కూర్మాచార్యులు, సత్యానందపాడి ఆధ్వ ర్యంలో దేవతాహ్వానం, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ట చేపట్టారు. స్వామిని హనుమత్ వాహనంపై వేంచేపు చేసి తిరువీధి నిర్వ హించారు. సంతానార్థులకు గరుడ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం మందస మహేంద్ర కళాసమితి కళాకారుల అన్న మాచార్య సంకీర్తన, శివసాయి నృత్యకళానికేతన్ వారిచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శేషవాహన సేవ చేశారు. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.