రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులతో సీఎం జగన్ దంపతులు భేటీ అయ్యారు. సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా సమావేశమ్యారు. గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చత్తీస్ఘడ్ గవర్నర్గా బదిలీ అయిన నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్గా రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గవర్నర్ గా అందించిన సేవలను గుర్తుంచుకుంటారన్నారు. మచ్చలేని వ్యక్తిత్వంతో, కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారన్నారు.