ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం పై పరిశీలనకు కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలానికి స్టేట్ టీం మంగళవారం రానున్నారని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వము లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా నేడు మండలానికి స్టేట్ టీం రానున్నారని ఆయన తెలిపారు.