రైతు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలో పాలనా ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైన నేపధ్యంలో ప్రజలు కాంగ్రెస్పార్టీని కోరుకుంటున్నారని వెల్లడించారు. సోమవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం అధికారం చేపట్టిన అప్పుడు టీడీపీ ఆదుకోవడంలో పూర్తిగా బడ్జె ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రైతులను విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులల్లో వ్యవసాయం, అనుబంధరంగాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. సమాజంలో 70శాతం రైతులు ఉన్నప్పటికీ కేటాయింపుల విషయానికి వచ్చే సరికి 2021-22లో 3. 77 శాతం ఉండటం గర్హణీయమన్నారు. 2022-23లో 3. 51శాతం 2022-23 లో 2. 77 శాతమే కేటాయింపులు జరిపారన్నారు. ఇక జగన్ వైఖరి చూస్తే అతని కంటే ఘనుడు మల్లన్న అన్న చందంగా ఉందని ఎద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే ఏటా వ్యవసాయ పెట్టుబడి కింద రూ. 12500లు అందజేస్తామని వాగ్దానం చేసి అధికారం చేపట్టాక అందులో నుంచి రూ. 5వేలు కోత విధించారన్నారు.
రైతులకు వడ్డీలేని రుణులు అందజేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సున్నావడ్డీ పథకానికి సున్నం పెట్టిందని ఎద్దేవాచేశారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి ఆ హామీని నాలుగేళ్లు కావస్తున్నా కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. ఎగువున ఉన్న అటు తెలంగాణ ఇటు కర్నాటకలో అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నా జగన్ ప్రభుత్వం అడ్డుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత రైతులు కాంగ్రెస్పార్టీనే కావాలని ఆశిస్తున్నారన్నారు. రాబోవు కాలంలో రైతుల కోరిక నెరవేరుతుందని, కాంగ్రెస్పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.