ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంటరిగా ఫీలైతే నన్ను సంప్రదించండి.... వాలంటైన్స్ డే సందర్భంగా యువకుడి వింత ఆఫర్

international |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 12:37 AM

ఒంటరిగా ఫీలైతే నన్ను సంప్రదించండి అంటూ వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యువకుడు వింత ఆఫర్ చేశాడు. బాయ్ ఫ్రెండ్ లేని సింగిల్ గర్ల్స్ కోసం గురుగ్రామ్‌ యువకుడు వినూత్న సేవలను అందజేయడానికి ముందుకొచ్చాడు. రోజుకు కొంత మొత్తం చెల్లిస్తే తాను బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటానని ఆఫర్ ఇచ్చాడు. ఈ ప్రేమికుల రోజు ఒంటరిగా ఉండాలంటే బోర్ ఫీలయ్యేవారు తన సేవలు అందుకోవచ్చని ప్రకటించాడు. గురుగ్రామ్‌కి చెందిన 31 ఏళ్ల షాకుల్ గుప్తా చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలని ప్రేమజంటలు రకరకాల ప్లాన్లు వేసుకుంటుంటే.. ఒంటరి పక్షులు మాత్రం బోర్‌గా ఫీలవుతుంటారని షాకుల్ చెప్పాడు. వారి ఒంటరితనాన్ని పోగొట్టేందుకే ఈ సేవలను తాను ప్రారంభించినట్లు వివరించాడు. అయితే, ఈ సేవలు లైంగిక అవసరాలకోసం కాదని స్పష్టం చేశాడు. ఒంటరితనంతో బాధపడే వారి కోసం 2018లోనే ఈ సేవలను తాను ప్రారంభించానని షాకుల్ తెలిపారు.


తనకు జీవితంలో ఎదురైన అనుభవం నుంచే ఈ ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’ కాన్సెప్ట్‌కు రూపమిచ్చానని పేర్కొన్నాడు. వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకుని తమ ప్రేమను వ్యక్తం చేయడం సర్వసాధారణమని, అలాంటి మాటలు వింటుంటే తమకూ ఓ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండేదని ఒంటరి యువత భావిస్తుందని అన్నారు. ఆ సమయంలో ఒంటరితనం వేధిస్తుందని, తాను కూడా గతంలో బాధపడ్డానని షాకుల్ తెలిపాడు.


అటువంటి వ్యక్తులు కొంతమొత్తం ఫీజు చెల్లించి తన సేవలను బుక్ చేసుకోవచ్చని షాకుల్ వివరించాడు. అద్దెకు బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్‌లో.. తనను అద్దెకు తీసుకున్న మహిళ ఒంటరితనాన్ని పోగొడతానని, కబుర్లు చెప్పడం, వారికోసం వంట చేసి పెట్టడం సహా పలు రకాల సేవలందిస్తానని షాకుల్ చెప్పాడు. ఇప్పటి వరకు తను 50 మందికి ఇలాంటి సేవలందించానని పేర్కొన్నాడు. కేవలం ప్రేమికుల రోజున మాత్రమే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com