ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూజిలాండ్‌లో భూకంప తీవ్రత..వణికిన ప్రజలు

international |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 11:27 AM

ప్రపంచంలోని వివిధ దేశాలలో భూకంపం సంభవిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికే తుఫాన్‌ బీభత్సంతో కకావికలం అవుతున్న న్యూజిలాండ్‌ వాసులను భూకంపం మరింత ఆందోళన కల్గించింది. సునామీ వస్తుందేమోననే భయం వెంటాడింది. అయితే, భూకంప కేంద్రం 374 కి.మీ. లోతులో ఉండటంతో పెద్దగా ప్రభావం లేదు. న్యూజిలాండ్ నార్త్ ఐలండ్‌లోని అతిపెద్ద నగరం అక్లాండ్‌కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 13) ఉదయం 9.18 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.48 నిమిషాలకు) భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 6.47 గంటలకు అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లోనూ భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.


టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో.. భూకంపం పేరు చెబితే వణుకుపుట్టే పరిస్థితి నెలకొంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ ఇప్పటికే అల్లకల్లోలం అవుతోంది. ఈ ద్వీప దేశాన్ని అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావానికి జనం చివురుటాకులా వణికిపోతున్నారు. అక్లాండ్ సహా పలు నగరాల తుఫాన్ బారిన పడ్డాయి. తుఫాన్ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానాల రాకపోకలను నిలిపివేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com