కత్తి నరసింహారెడ్డిని ఎమ్మెల్సీగా రెండవసారి గెలిపించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారాయుడు , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు కృష్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెటి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలపై శాసన మండలిలో గళం విప్పిన వ్యక్తి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డేనని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలరాజు, సహాయ కార్యదర్శి అశోక్, తేజ పాల్గొన్నారు.