భార్య నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్న భర్త కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వేధింపులు తాళలేక భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా 2022 జూలైలో విడాకులు మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసుకోగా తాజాగా భార్య అప్పీల్‌ను కోర్టు కొట్టేసింది. భర్త, భార్య చేతిలో క్రూరంగా వేధింపులకు గురయ్యాడని, ప్రతీ వ్యక్తి గౌరవంగా జీవించడానికి అర్హుడు అని పేర్కొంది.