అచ్యుతాపురం: మండలం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఖాజిపాలెం, జగ్గానపేట గ్రామంలో క్లస్టర్ 8మంది పరిధిలో రచ్చబండ కార్యక్రమం ఎలమంచిలి టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా, వైసీపీ చేస్తున్న, అరాచకాలను, దుర్మార్గ పాలను ప్రతి ఇంటింటికి తెలియజేయాలని కోరారు. మార్చి 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనపరెడ్డి నరసింహారావు, పూడిమడక మాజీ సర్పంచ్ మెరుగు బాపు నాయుడు, జిల్లా టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి పొనమళ్ల కొండబాబు, మండల తెలుగు యువత అధ్యక్షుడు లాలం ప్రసాద్, కాజీపాలెం మాజీసర్పంచ్ పీల తులసిరామ్, ఎంపీటీసీ బుదిరెడ్డి వెంకటరమణ, జగంపేట మాజీ సర్పంచ్ మారిశెట్టి రమణ బాబు, జగ్గన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆడారి సాంబశివ, కార్యదర్శి చందకు శ్రీను, తేటకల రామ్ గణేష్, వరదరాజు, బంగారయ్య, ఆడారి వెంకట అప్పారావు, ఆడారి శేషగిరి, నందవరపు గంగరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.