వైసీపీలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్లిన ఆయనకు కొద్ది సేపటికే గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం, వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది.