పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ నుంచి చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు త్వరలోనే అప్ డేట్ వెర్షన్-2023 రానుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కి.మీ వరకూ ప్రయాణించేలా కొత్త వెర్షన్ రేంజ్ ఉండనుందని సంస్థ ప్రకటించింది. 2.88 కిలో వాట్ హవర్ బ్యాటరీ ఉన్న ప్రస్తుత మోడల్ 90 కి.మీ మైలేజ్ ఇస్తోంది. అయితే, మోటార్ ఔట్ పుట్ మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్ గానే ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్ మోటర్ 4KW పవర్ కలిగి ఉంటుంది.