దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సిసోడియా తెలిపారు. 'సీబీఐ మళ్లీ విచారణకు పిలిచింది. నాకు వ్యతిరేకంగా సీబీఐ, ఈడీలను ప్రయోగించారు. బ్యాంక్ లాకర్ లో సోదాలు చేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. అయినా విచారణకు సహకరిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.