మహాశివరాత్రి పర్వదిన పండుగను పురస్కరిం చుకొని శనివారం ప్యాపిలి పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి ధూప, దీప, నైవేద్యాలు , అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యాపిలి పట్టణంలోని ప్రజలు శ్రీ నీలకంఠ స్వామిని దర్శనం కోసం దేవాలయం నుండి వీధిచివరి వరకు బారులు తీరారు. కుర్నీ నేసే సంఘం ఆధ్వర్యంలో అభిషేకం కోసం పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పండులతో పంచామృతాన్ని అభిషేకం కోసం భక్తులకు ఉచితంగా పంపిణీ చేసి శ్రీ నీలకంఠశ్వర స్వామి అభిషేకం నిర్వహించారు. అభిషేకం నిర్వహించిన భక్తులు శ్రీ నీలకంఠ స్వామి దర్శనం, అభిషేకంతో సంతోషం వ్యక్తం చేస్తూ మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గుకుండా కుర్నీ నేసే సంఘ వారు సేవలు నిర్వహించారు.