మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు సమీపంలో గల సోమేశ్వరాలయం ఏడాదికోసారి మాత్రమే తెరచుకుంటుంది. వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై ఉన్న ఈ శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయాన్ని సామాన్య ప్రజల కోసం తెరవాలంటూ 1974లో ఉద్యమం జరిగింది. దీంతో అప్పటి సీఎం ప్రకాశ్ సేథీ ఆలయానికి తాళం తీసి శివరాత్రి రోజు మాత్రమే పూజలు జరిపేందుకు అనుమతించారు. అప్పట్నుండి శివరాత్రి రోజు మాత్రమే ఆలయం తెరచుకుంటుంది.