పలాస నగరంలోని పాతజాతీయ రహదారి మైస్టోర్ సమీపంలో సినీఫక్కీలో ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వద్ద గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బురడీ కొట్టించి సినీఫక్కీలో సెల్‌ఫోన్ దొంచిలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రైల్వేడ్రైవరుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కవిటి జగ్గప్ప సమీపంలో నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నారు. శివరాత్రి కావడంతో మధ్యాహ్నం వరకూ సమీపంలో సత్యసాయి మందిరంలో పూజలు చేసి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో మైస్టోర్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు తమ బైక్‌ను బోల్తాపడినట్టు నటించారు. నిజమే అనుకొని జగ్గప్ప వారిని రక్షించే ప్రయత్నం చేసి బైక్‌పై పడిపోయినట్లు నటించిన వారికి పైకి ఎత్తారు. అనంతరం ఇంటికి వెళ్లి చూసే సరికి తన షర్టు ప్యాకెట్లోని రూ.19వేలు విలువైన మోటరోలా సెల్ ఫోన్ మాయమైంది. వెంటనే తేరుకొని ఆ యువకులు పడిపోయిన స్థలం వద్దకు వచ్చేసరికి అప్పటికే వారు మాయమయ్యారు. దీంతో మోసపోయినట్టు గుర్తించిన జగ్గప్ప పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.