వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గొంతు నొక్కడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని కర్నూలు రూరల్ మండలం టీడీపీ కన్వీనర్ బుర్ర వెంకటేష్ నాయుడు అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సభను పోలీసులు అడ్డుకున్న దానికి నిరసనగా మండల నాయకులు, కార్యకర్తలు కలిసి శనివారం దిన్నెదేవరపాడు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహా నికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమలో నాయకులు సయ్యద్, షేక్షావలి, వెంకటసుబ్బయ్య, చిత్రసేనుడు, సోఫీబేగ్ తదితరులు పాల్గొన్నారు.