దక్షిణ ఛత్తీ్‌సగఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తరాదిలో వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రయాణిస్తోంది. వీటి ప్రభావంతో శనివారం ఉత్తరకోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణుడు తెలిపారు.