విశ్వాసాలకు పెట్టింది పేరు భారతదేశం. దేనినైనా ఇక్కడ భరిస్తారు కానీ విశ్వాసాలను మాత్రం దెబ్బతీసుకోరు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై ‘హనుమాన్’ లోగో తిరిగొచ్చింది. హనుమాన్ లోగో తొలగించడాన్ని చాలా మంది తప్పుబట్టారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దుమారం రేగడంతో సంస్థ దిగొచ్చింది. ఎయిర్‌క్రాఫ్ట్ తోక భాగంలో హనుమాన్ చిత్రాన్ని తిరిగి ఏర్పాటు చేసింది. ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షో 2023లో హెచ్ఏఎల్కి చెందిన అత్యాధునిక HLFT-42 ప్రోటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రదర్శనకు ఉంచారు. ఫిబ్రవరి 14న తొలిసారిగా ప్రదర్శనలో ఉంచిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ తోక భాగంలో వాయుపుత్ర హనుమాన్ లోగో ఉంది. ఇది సందర్శకులను ఆకట్టుకుంటుంది. అయితే, రెండు రోజుల తర్వాత ‘హనుమాన్’ లోగో తొలగించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను అక్కడ ఉంచారు. విమానంపై హనుమాన్ లోగో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సంస్థ సీఎండీ సీబీ అనంతకృష్ణన్ స్పందించారు హెచ్ ఎల్ ఎఫ్ టీ-42 ప్రోటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై హనుమాన్ లోగో పెట్టడం వెనుక గానీ, తీసేయడం వెనుక గానీ తమకు ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన చెప్పారు. ఈ ప్రోటోటైప్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్.. హెచ్ ఏఎల్ గతంలో రూపొందించిన ‘మారుత్’ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆధునిక వెర్షన్. మారుత్ అంటే ‘పవనం’ లేదా ‘గాలి’ అనే అర్థాలున్నాయి. హనుమంతుడు పవనకుమారుడని చెబుతారు. అందువల్ల ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌పై ‘హనుమాన్’ లోగోను ఏర్పాటు చేసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.