కొత్తచెరువు మండలం కొడపగానిపల్లి తపాలా బ్రాంచి కార్యాలయ పరిధిలోని ఖాతాల లావాదేవీలపై ఉన్నతాధికారులు విచార ణకు ఆదేశించారు. ఇటీవల తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ సత్యనా రాయణ సాధారణ తనిఖీలో భాగంగా కొడపగానిపల్లి బ్రాంచి ఖాతాల లావాదే వీలను తనిఖీ చేశారు. పోస్టల్ శాఖలో అమలవుతోన్న వివిధ పథకాల ఖాతా లను పరిశీలించి నమోదుల్లో తేడాలను గుర్తించారు. దీంతో గతంలో బ్రాంచిలో జరిగిన ఖాతాల లావాదేవీలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పెనుకొండ ఇన్స్పెక్టర్ విమల్ కుమార్ తపాలా ఖాతాలు, ఆన్లైన్ నమోదులపై విచా రణ చేపట్టారు. సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా విచారణ పూర్తయిన తరువాత వివరాలు వెల్లడి స్తామని తెలిపారు.