శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జమ్మన్న ఇటీవల మృతి చెందాడు. వారి కుటుంబానికి సోమవారం నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి అండగా నిలవడంతో పాటు వారి కుటుంబానికీ 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సుధాకర్ రెడ్డి, తెలుగు యువత శ్రీనాథ్ నాయుడు, టీఏన్టీయూసీ బాబయ్య, సింహాద్రి, సుంకన్న, లాలు స్వామి, అంజి, చిన్న హుస్సేన్ , రవితేజ మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.